పోలీసుల బస్సు బోల్తా..  21 మందికి గాయాలు

Apr 20,2024 14:18 #21peoples, #bus raveling, #injured

భోపాల్‌: పోలింగ్‌ విధుల్లో పాల్గొనేందుకు వెళ్లిన పోలీసుల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. వీరిలో 8 మంది పోలీస్‌ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు భోపాల్‌-బేతుల్‌ హైవేలోని బరేతా ఘాట్‌ సమీపంలో లారీని తప్పించే క్రమంలో ఆ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 40 మంది పోలీస్‌ సిబ్బందిలో 21 మంది గాయపడ్డారు. తీవ్ర గాయాలైన 8 మంది బెతుల్‌లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలినవారికి షాపూర్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️