ఆలోచించి.. అర్థం చేసుకొని… సరైన నిర్ణయం తీసుకోండి : రాహుల్‌ గాంధీ

Apr 5,2024 08:14 #Rahul Gandhi, #Tweet, #voters

న్యూఢిల్లీ : ” ఆలోచించి.. అర్థం చేసుకొని… సరైన నిర్ణయం తీసుకోవాలి ” అని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ … రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. భారతదేశం ప్రస్తుతం కీలక దశలో ఉందని, దేశాన్ని నిర్మించే వారికి, నాశనం చేసే వారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలని ప్రజలను కోరారు. ” ప్రజల భవిష్యత్తు వారి చేతిలోనే ఉంది. వారు ఆలోచించి, అర్థం చేసుకుని, ఆపై సరైన నిర్ణయం తీసుకోవాలి” అని సూచించారు. ప్రస్తుతం దేశం ”కీలమైన దశ”లో ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌, భారత కూటమి అంటే యువతకు ఉద్యోగాలు, రైతులకు ఎంఎస్‌పీ హామీ, ప్రతీ పేద మహిళని లక్షాధికారి చేయడం, కార్మికులకు రోజుకు కనీసం రూ. 400, కులగణన, ఆర్థిక సర్వే, రాజ్యాంగం, పౌరహక్కలని రక్షిస్తుందని అన్నారు. బిజెపి అంటే నిరుద్యోగం, రైతులపై రుణభారం, రక్షణ, హక్కులు లేని మహిళలు, నిస్సహాయ కార్మికులు, వివక్ష, నిరుపేదలపై దోపిడి, నియంతృత్వం, మోసపూరిత ప్రజాస్వామ్యం అని రాహుల్‌ విమర్శించారు.

➡️