ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Mar 3,2024 11:05 #Delhi, #road acident

ఢిల్లీ : ఢిల్లీలోని బదర్‌పూర్‌ ఫ్లైఓవర్‌పై శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు, ఆల్టో కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులు ముగ్గురూ ఒకే కాలనీకి చెందిన వారు. ఫరీదాబాద్‌లో ఒక వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️