లక్నోలో విషాదం.. ఇంట్లో సిలిండర్ పేలి ఐదుగురు మృతి

Mar 6,2024 11:04 #5 death, #fire acident, #Lucknow

లక్నో :సిలిండర్ పేలి ఐదుగురు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కకోరి ప్రాంతంలో హతా హజ్రత్ సాహెబ్ కస్బా లోని ఓ ఇంట్లో మంగళవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎల్‌పీజీ సిలిండర్లు పేలాయి. ఆ సమయంలో నిద్రలో ఉన్న వారిలో ఐదుగురు మృతి చెందగా మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను ముషీర్ (50), హుస్న్ బానో (45), రాయ (7), ఉమా (4), హీనా (2)గా గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారని, వారిలో నలుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని లక్నో పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

➡️