బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరికి మరణశిక్ష

May 20,2024 14:59 #high court, #POCSO case, #Rajasthan

రాజస్థాన్‌: గత ఏడాది మైనర్ బాలికపై అత్యాచారం చేసి సజీవ దహనం చేసిన ఇద్దరు వ్యక్తులకు రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలోని పోక్సో కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. కాలు, కన్హాలకు కోర్టు మరణశిక్ష విధించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహావీర్ సింగ్ కిష్ణావత్ తెలిపారు. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఈ నేరానికి గాను కాలు, కన్హాలను కోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది. సాక్ష్యాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలతో అరెస్టు చేసిన మరో ఏడుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వీరిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని హైకోర్టులో సవాలు చేస్తామని కిష్ణావత్ తెలిపారు. గతేడాది ఆగస్టు 2న పశువులను మేపేందుకు వెళ్లిన 14 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. ఇద్దరు నిందితులు బాలికపై అత్యాచారం చేసి బొగ్గు కొలిమిలో పడేసిన ఘటన విదితమే.

➡️