భారత్‌లో పర్యటించనున్న యుఎన్‌జిఎ అధ్యక్షుడు

Jan 21,2024 16:44 #India visit, #UNGA president

వాషింగ్టన్‌ :   ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ భారత్‌ పర్యటించనున్నారు. జనవరి 22 నుండి 26 వరకు భారత్‌లో ప ర్యటించనున్నారని, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో భేటాకానున్నారని ఆయన అధికారిక కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీ, జైపూర్‌, ముంబయిలో పర్యటించనున్నారని పేర్కొంది.

తన ఐదు రోజుల పర్యటనలో ఫ్రాన్సిస్‌ భారతదేశ నేతలతో ద్వైపాక్షి క చర్చలు నిర్వహిస్తారు.  స్థిరత్వం, బహుపాక్షికత, డిజిటల్‌, పబ్లిక్‌ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గంటారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్‌తో నిర్వహించే సమావేశంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, భారత్‌ ఒప్పందం, ఐరాసకు అందించే సహకారంపై చర్చలు జరగనున్నాయి. 2024 ఏప్రిల్‌ 15-19 మధ్య న్యూయార్క్‌లో నిర్వహించే ‘ఇనాగ్యురల్‌ సస్టైనబిలిటీ వీక్‌’ , సెప్టెంబర్‌లో జరగనున్న ‘సమ్మిట్‌ ఆఫ్‌ ది ఫ్యూచర్‌’ కార్యక్రమాల్లో పాల్గనేందుకు భారత్‌ను ఆహ్వానించనున్నారు.

శాంతి,పురోగతి, శ్రేయస్సు మరియు సుస్థిరత థీమ్‌పై ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ వరల్డ్‌ అఫైర్స్‌లో ఫ్రాన్సిస్‌ ప్రసంగించనున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. అలాగే రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ స్మారక చిహ్నానికి నివాళులు అర్పించడంతో పాటు పలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

➡️