యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

Jul 1,2024 20:26 #Exams, #list released, #Results, #upsc

ఢిల్లీ : యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా జూన్‌ 16న ఈ పరీక్ష నిర్వహించిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సోమవారం ఫలితాలు విడుదల చేసింది. దీనికి సంబంధించిన రిజల్ట్స్‌ అధికారిక వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్‌ మార్కులు, ఆన్షర్‌ కీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు తెలిపింది. అలాగే, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సైతం యూపీఎస్సీ ప్రకటించింది. ఐఎఫ్‌ఎస్‌ (మెయిన్‌) పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను విడుదల చేసింది.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి : https://upsc.gov.in/

➡️