మణిపూర్‌లో మళ్లీ హింస

Jan 2,2024 09:09 #again, #Manipur, #Violence
  • ముగ్గురు కాల్చివేత
  • లోయ జిల్లాల్లో కర్ఫ్యూ విధింపు

ఇంఫాల్‌ : మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపబడ్డారు, దీంతో లోయ జిల్లాల్లో కర్ఫ్యూ కర్ఫ్యూ విధించారు. ఈ ఘాతుకానికి పాల్పడిందెవరో ఇంకా నిర్ధారించలేదని అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం కొందరు సాయుధ దుండగలు మభ్యపెట్టే దుస్తుల్లో వచ్చి స్థానికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు, మరో అయిదుగురు గాయపడ్డారని లీసులు తెలిపారు. దాడి వెనుక ఉన్న వారిని పట్టుకుని శిక్షిస్తామని ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ తెలిపారు. దాడి అనంతరం కోపోద్రిక్తులైన స్థానికులు మూడు నాలుగు చక్రాల వాహనాలకు నిప్పు పెట్టారు. శాంతి భద్రతలను కాపాడడంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు మరోసారి డిమాండ్‌ చేశాయి. కుకీ, మెయితీ మధ్య విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి యత్నిస్తోందని ఆయన తెలిపారు.

➡️