గెలుపు కోసం ఏదైనా చేస్తారు !.. బిజెపిపై కేజ్రివాల్‌ మండిపాటు

Feb 22,2024 10:28 #BJP, #coments, #Kejriwal

న్యూఢిల్లీ : ఛండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక ఫలితాన్ని సుప్రీం రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఎన్నికల్లో గెలవడం కోసం బిజెపి ఏదైనా చేస్తుందని ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రివాల్‌ విమర్శించారు. ఎంఎల్‌ఎలను ఎర వేసి పట్టుకుని, ప్రభుత్వాలను బహిరంగంగానే కూల్చివేయడం వంటి చర్యలకు పాల్పడిందని విమర్శించారు. ‘భగవంతుడు జోక్యం చేసుకుని, కాషాయ పార్టీ పాల్పడిన అధర్మానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయించాడు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఛండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలపై సుప్రీం తీర్పును ప్రశంసిస్తూ ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ తీర్పు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని అన్నారు. పంజాబ్‌, హర్యానా సరిహద్దుల్లో సాగుతున్న రైతాంగం ఆందోళనలను ప్రస్తావిస్తూ, ఢిల్లీకి రావడానికి రైతులను అనుమతించకుండా బిజెపి అడ్డుపడుతోందన్నారు. వారు పండించే పంటలకు సరైన ధర చెల్లించకపోగా, వారు చెప్పేవి వినడం కూడా లేదని విమర్శించారు.

➡️