అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. మహిళా, శిశు, వికలాంగులు, వఅద్ధుల సంక్షేమశాఖపై అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ హాజరు ఉండేలా చూడాలని ఆదేశించారు. కేంద్రాలకు సొంత భవనాలపై దృష్టి సారించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొబైల్‌ అంగన్వాడీ కేంద్రాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్షకు హాజరయ్యారు.

➡️