అగ్రకుల దురహంకారులను అరెస్టు చేయాలి – కెవిపిఎస్‌

Mar 26,2024 23:35 #KVPS, #press meet

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో డిప్లమో చదువుతున్నబొనిగల నవదీప్‌, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎండూరివారిపాలెంలో యలమర్తి ఆంజనేయులుపై దాడిచేసిన అగ్రకుల దురహంకారులను తక్షణమే అరెస్టు చేయాలని కెవిపిఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, బాపట్ల జిల్లా కార్యదర్శి కోలా శరత్‌, మాల మహానాడు నాయకులు దాసరి నాగేంద్ర, తుమ్మల ప్రాన్సిస్‌, బాధిత కుటుంబ సభ్యులు విజయవాడలోని గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. కేసును పక్కదారి పట్టిస్తున్న పోలీసులపై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దుర్మార్గులకు శిక్ష పడేందుకు రోహిత్‌ వేముల చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

➡️