అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా..

Feb 10,2024 15:30 #adjourned, #Assembly Meeting

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు. అంతకుముందు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన భట్టి ప్రసంగం మధ్యాహ్నం 1:20 గంటలకు ముగిసింది. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,75,891 కోట్లతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.

➡️