ఇంజినీర్లతో రెండో రోజూ ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ భేటీ

హైదరాబాద్‌: ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ) నిపుణుల కమిటీ రెండో రోజైన గురువారం సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ఇంజినీర్లతో సమావేశమైంది. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో చంద్రశేఖర్‌ అయ్యర్‌ కమిటీ ఇంజినీర్లతో విడివిడిగా చర్చలు జరుపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ డిజైన్ల వివరాలపై ఆరా తీస్తోంది. వాటిని రూపొందించిన సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ఇంజినీర్లతో ఇప్పటికే బుధవారం సమావేశమైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ పనులు చేసిన గుత్తేదార్ల ప్రతినిధులతోనూ నేడు సమావేశం కానుంది. మూడు ఆనకట్టల మోడల్స్‌ను కమిటీ శుక్రవారం పరిశీలించనుంది.

➡️