ఈత కోసం వెళ్లి నీట మునిగిన ఇద్దరు బాలురు

Feb 11,2024 16:45 #boys, #died, #swimming

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు కావడంతో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మఅతిచెందారు. ఈ ఘటన మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీంతో భయాందోళన చెందిన మిగిలిన విద్యార్థులు హుటాహుటిన ఇంటికెళ్లి జరిగిన విషయం చెప్పారు. తల్లిదండ్రులు, బంధువులు చెరువు వద్దకు వచ్చి చూడగా వారు అప్పటికే మఅతిచెందారు. అనంతరం గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు స్పాట్‌కు వచ్చి విద్యార్థుల వయసు ఒకరిది 11 ఏళ్లు, మరొకరిది 12 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️