ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌

Dec 23,2023 16:20 #acp dg, #cv anand

హైదరాబాద్‌ : తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్‌ ఆఫీసర్‌ సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం ఉద్యోగులు, ఇతర సిబ్బంది సీవీ ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మొన్నటి వరకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా కొనసాగిన సీవీ ఆనంద్‌ను.. ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనను ఏసీబీ డీజీగా నియమించిన సంగతి తెలిసిందే.రెండేళ్ల పాటు హైదరాబాద్‌ సీపీగా కొనసాగాను అని సీవీ ఆనంద్‌ తెలిపారు. శాంతి భద్రతలను పటిష్టంగా ఉంచామని, అది వఅత్తిపరంగా చాలా సంతఅప్తిని ఇచ్చిందన్నారు. ఒకేసారి అన్ని రకాల పండుగలు వచ్చినప్పటికీ, ఎక్కడా కూడా మత సామరస్యం దెబ్బతినకుండా ప్రశాంతంగా పండుగలను నిర్వహించామని తెలిపారు. సైబర్‌ క్రైమ్‌లో గతంలో ఎన్నడూ చూడని నేరాలను చూశామన్నారు. ఇక ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని సీవీ ఆనంద్‌ తెలిపారు.

➡️