ఒకేరోజు భార్యాభర్తలు బలవన్మరణం..

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం కొల్హారిలో విషాదం చోటుచేసుకున్నది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రకు చెందిన పల్లవితో కొల్హారి గ్రామనికి చెందిన విజరుకి గతేడాది మే నెలలో వివాహం జరిగింది. సంక్రాంతి పండగకు పుట్టింటికి వెళ్లిన పల్లవి.. మధ్యాహ్నం అత్తగారి ఇంటికి వచ్చింది. కుటుంబసభ్యులు వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి పల్లవి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకిపోయింది. దీంతో వెంటనే ఆమెను రిమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే పల్లవి మఅతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, తనపై అపవాదు వస్తుందన్న భయంతో విజరు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యభర్తలు ఒకేసారి చనిపోవడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పల్లవి మఅతికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.

➡️