కూలిన బిల్డింగ్‌ పైకప్పు.. 8 వాహనాలు ధ్వసం

Feb 10,2024 14:47 #collapsed building, #rangareddy

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బిల్డింగ్‌ పైకప్పు ఊడి హౌండా షోరూంలో పడ్డాయి. సిబ్బంది భయాందోళనతో బయటకు పరుగుతీశారు. అక్కడే ఉన్న కొత్త బైకులు ధ్వంసం అయ్యాయి. వివరాల్లోకి వెళితే శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గణేష్‌ కాంప్లెక్స్‌ భవనం నిర్మించి దాదాపు 40 ఏళ్ల అయ్యింది. బిల్డింగ్‌ పాత పడటంతో సరైన మరమత్తులు లేక శిథిలావస్థకు చేరింది. బిల్డింగ్‌ లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో ఉన్న హౌండా షోరూంలో ఒక్కసారిగా పైకప్పులు ఊడిపడ్డాయి. ఫోరూంలోని 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు ఇన్‌ ఫాం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

➡️