హైదరాబాద్: కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తుంటి ఎముక గాయం అవ్వడం ఆపరేషన్ చేయించుకోవడం జరిగాయి. అప్పటినుండి కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. రేపు మధ్యాహ్నం 12:45 నిమిషాలకి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ స్పీకర్ చాంబర్లో ప్రమాణ స్వీకారాన్ని చేయబోతున్నారు. 12:00కి నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపి కార్యాలయం కి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత ఎల్ఓపి నేతగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/2-67.jpg)