గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన బిఆర్‌ఎస్‌ నేతలు

హైదరాబాద్‌: ప్రభుత్వం నామినేట్‌ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ హైకోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తూ గత జూలైలో మంత్రిమండలి తీర్మానం చేసింది. మంత్రిమండలి నిర్ణయాన్ని గవర్నర్‌ తమిళిసై గతేడాది సెప్టెంబర్‌ 19న తిరస్కరించారు. గవర్నర్‌ తన పరిధి దాటి వ్యవహరించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్‌ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

➡️