ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన రాజధాని బస్సు

Jan 6,2024 16:10 #road accident

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె మండలం మామిళ్లగూడెం వద్ద రాజధాని ఏసీ బస్సు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. బస్సు పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు దూసుకు వెళ్లింది. ఖమ్మం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి తిరిగి ఖమ్మం వెపు వెళ్తున్నది. నేషనల్‌ హైవే 365 బీబీ రహదారిపై బోల్తా పడింది. ఆ తర్వాత పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురికి ప్రయాణికులు స్వల్ప గాయాలయ్యాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది.

➡️