చిలకలూరిపేటలో ఉమ్మడి కూటమి సభకు ఏర్పాట్లు : ప్రత్తిపాటి

Mar 13,2024 12:35 #press meet, #Tdp Leader pattipati

చిలకలూరిపేట: బప్పూడిలో నిర్వహించనున్న ఉమ్మడి కూటమి సభ కోసం దేశమంతా ఎదురుచూస్తోందని టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోడి, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఇది జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే సభ కాబోతోందన్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు, నేతలు తరలివస్తారని చెప్పారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రత్తిపాటి పుల్లారావు వివరించారు.

➡️