జీవో నంబర్‌ 3 తెచ్చిందే కేసీఆర్‌ సర్కారు: సీతక్క

Mar 10,2024 15:16 #press meet, #seehakka

హనుమకొండ: మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండలోని కేయూలో రూ.68 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సర్కారు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌ సర్కారు మహిళలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తోందని చెప్పారు.’ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత అనవసరంగా విమర్శలు చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తాను సీఎం కావాలని ఆమె భావించారు. పార్టీ ఓటమితో ఆశలన్నీ గల్లంతయ్యాయి. మహిళలను కాంగ్రెస్‌ నుంచి దూరం చేయాలని కవిత యత్నిస్తున్నారు. జీవో నంబర్‌ 3కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు ఆ జీవో ఇచ్చిందే కేసీఆర్‌ సర్కారు అన్నారు. బిఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం బంద్‌ చేసి.. నిర్మాణాత్మక విపక్షంగా పనిచేయాలి’ అని సీతక్క తెలిపారు.

➡️