టిడిపి – జనసేనది ప్రజల కోసం కుదిర్చిన పొత్తు: చంద్రబాబు

Feb 28,2024 20:32 #Nara Chandrababu, #speech

తాడేపల్లిగూడెం: వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసమే టిడిపి-జనసేన పార్టీలు కలిశాయని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, వైసిపి దొంగలపై టిడిపి-జనసేన పోరాడాలని సూచించారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘తెలుగు జన విజయకేతనం’ ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు.

”రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు ఇది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలి. 2029కి విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేశాం. హైదరాబాద్‌ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం. పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే సంకల్పంతో ముందుకెళ్లాం. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు సైకో పాలన ఉంది. ఏ సీఎం అయినా అభివఅద్ధి పనులతో పాలన సాగిస్తారు.. జగన్‌ సీఎం అయ్యాక అరాచకాలతో పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని జగన్‌ అపహాస్యం చేశారు. వైసిపి వేధింపులు తట్టుకోలేక క్రికెటర్‌ హనుమ విహారి పారిపోయే పరిస్థితి వచ్చింది. సొంత చెల్లి మరో పార్టీలో చేరితే సోషల్‌మీడియాలో వేధించారు. జగన్‌ మానసిక స్థితికి ఈ ఘటనలే నిదర్శనం. అందుకే, వైసిపిను చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలి”అని అన్నారు.

➡️