టిడిపికి కిశోర్‌ చంద్రదేవ్‌ రాజీనామా

Feb 15,2024 20:42 #resignation, #tdp ex minister

ప్రజాశక్తి- కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) :తెలుగుదేశం పార్టీకి కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్ర సూర్యనారాయణదేవ్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్‌డిఎలో టిడిపి చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకు ఈ మేరకు ఫ్యాక్స్‌ ద్వారా తన రాజీనామా లేఖ పంపారు. ‘మన భిన్నత్వం మధ్య ఐక్యత మన రాజ్యాంగానికి హాల్‌ మార్క్‌. ఇప్పటికే చిన్నాభిన్నమైన సమాజంలో చీలికలు సృషిస్తున్న మతోన్మాదుతులచే ఈ అంశం మాంగల్‌ చేయబడింది. మతోన్మాదుల బీభత్స పాలనకు తెరలేపడం ద్వారా ఓటు బ్యాంకులను సృష్ట్టించుకోవడమే ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వ వన్‌ పాయింట్‌ ప్రోగ్రాంగా కనిపిస్తోంది. నా రాజకీయ జీవితంలో 5వ దశాబ్దంలో నేను చూసిన అత్యంత దారుణమైన పరిస్థితి ఇది. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయం. అధికారం కోసం నా ఆత్మను అమ్ముకోలేను’ అని ఈ లేఖలో కిశోర్‌ చంద్రదేవ్‌ పేర్కొన్నారు.

➡️