టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది : కనకమేడల

ఢిల్లీ : టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరిందని టీడీపీ సీనియర్‌ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ అధికారికంగా వెల్లడించారు. ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని తెలిపారు.. పొత్తు ప్రకారం మూడు పార్టీలు ఓ కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాయని వివరించారు. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తాయని కనకమేడల చెప్పారు. పొత్తుకు మూడు పార్టీల నేతలు అంగీకరించారని, సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చారని తెలిపారు.

➡️