టీమ్‌ బస్సులో మద్యం సేవించిన హెడ్‌కోచ్‌.. సస్పెండ్‌ చేసిన హెచ్‌సీఏ

Feb 16,2024 15:23 #head coach, #suspended

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహిళల జట్టు హెడ్‌కోచ్‌ జై సింహపై వేటు పడింది. టీమ్‌ బస్సులో మద్యం సేవించి క్రికెటర్లను వేధింపులకు గురి చేసిన అతడిని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సస్పెండ్‌ చేసింది. టీమ్‌ బస్సులో జై సింహ మద్యం సేవించిన దఅశ్యాలు వాట్సాప్‌ గ్రూపులు, టీవీ చానెళ్లలో వైరల్‌ అయ్యాయి. దాంతో, అతడిపై తక్షణమే వేటు వేస్తున్నట్టు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు ఓ ప్రకటనలో తెలిపారు.’జై సింహ మద్యం సేవించిన ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం. అనంతరం అతడిపై చర్యలు తీసుకుంటాం. మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించేది లేదు. విచారణ ముగిసేంతవరకు జై సింహను సస్పెండ్‌ చేస్తున్నాం’ అని జగన్‌ వెల్లడించారు.

➡️