తిరుపతిలో ‘నిజం గెలవాలి’ యాత్ర

Mar 23,2024 21:35 #Nara Bhuvaneshwari, #tirupathi

ప్రజాశక్తి – వాకాడు (తిరుపతి జిల్లా) :నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి శనివారం తిరుపతి జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గూడూరు నియోజకవర్గం వాకాడు మండలంలోని తిరుమూరు గ్రామానికి చెందిన పిడుగు వెంకటస్వామి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో, ఆయన కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పిస్తూ ఆర్థిక సాయం అందజేశారు. తొలుత వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా నిజం వైపు నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పసల పెంచలయ్య, గూడూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పాసిం సునీల్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️