తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న యాత్రికులు సైతం తిరుమలకు వస్తున్నారు. దీంతో కొండపై ఉన్న కంపార్టుమెంట్లలో 3 కంపార్టుమెంట్లు యాత్రికులతో నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. బుధవారం స్వామివారిని 65,683 మంది దర్శించుకోగా 21,177 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

➡️