తిరుమలలో పెరిగిన యాత్రికుల రద్దీ

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. దీంతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు యాత్రికులతో నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.గురువారం స్వామివారిని 57,973 మంది యాత్రికులు దర్శించుకోగా 21,722 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.95 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.తిరుపతి గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి యాత్రికులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల చిన్న జీయర్‌ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో మునిక్రిష్ణారెడ్డి, పాల్గొన్నారు.

➡️