తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం

Mar 24,2024 16:36 #tirumala tirupathi temple

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తిరుమల చేరుకున్న బ్రహ్మానందం వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలో రంగనాయకుల మండపంలో ఆయనను అర్చకులు ఆశీర్వదించారు. ఆయనకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం నుండి బయటికి వచ్చిన బ్రహ్మానందంను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అనంతరం ఆయనతో సెల్ఫీలు దిగారు.

➡️