తెలంగాణలో పలువురు అధికారుల బదిలీలు

Mar 14,2024 13:30 #officers transfers, #Telangana

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం పలువురు అధికారులను బదిలీ చేసింది. తాజాగా ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శింగా సీహెచ్‌ శివలింగయ్య, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా అశ్విని తాజీ వాకడేను నియమించారు. అలాగే విద్య, మౌలిక సదుపాయాల వీసీ, ఎండీగా మల్లయ్య భట్టును ప్రభుత్వం నియమించింది. సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా మల్లయ్య భట్టుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

➡️