తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు

హైదరాబాద్‌: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సలహాదారులుగా నియమితులైన సోమేశ్‌కుమార్‌, చెన్నమనేని రమేష్‌, రాజీవ్‌ శర్మ, అనురాగ్‌ శర్మ, ఏకే ఖాన్‌, జీఆర్‌ రెడ్డి, ఆర్‌.శోభ నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది.

➡️