తెలంగాణలో రేపటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు

Feb 27,2024 16:36 #hyderabad, #temparature

హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తెలిపింది. మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, మరో వైపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమూ ఉందని వెల్లడించింది.

➡️