దళితబంధు గ్రౌండిండ్‌కు ఆదేశాలు ఇవ్వాలని లబ్ధిదారుల నిరసన

Dec 21,2023 16:05 #dalithulu, #Dharna

నల్లగొండ : నల్లగొండ నియోజక వర్గంలోని దళితబంధు లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రొసీడింగ్స్‌ ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయినందున నిధులను విడుదల చేయాలని నల్లగొండ లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద లబ్ధిదారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లబ్దిదారుల సంఘం నేతలు పాలడుగు నాగార్జున, బకరం శ్రీనివాస్‌, కాంచనపల్లి విమలమ్మ, అద్దంకి రవీందర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నలగొండ నియోజకవర్గంలో దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేసిందన్నారు.ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా నిధులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి వెంటనే గ్రౌండింగ్‌ పూర్తి చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో లబ్ధిదారుల కుటుంబాల చేత ఆందోళనను ముమ్మరం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు

➡️