నిరుద్యోగులు ఆగ్రహం.. ఓయూలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రతులు దహనం

Dec 21,2023 15:36 #Dharna, #studens, #usmania university

హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రతులను నిరుద్యోగులు దహనం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 15 రోజులకే సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో రూ.4000 నిరుద్యోగ భఅతి, ఉద్యోగ నియామకాలపై శ్వేత పత్రం విడుదల చేయకుంటే దాడులు చేస్తామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ మానవతారారు హెచ్చరించారు.బుధవారం శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తాము నిరుద్యోగ భఅతి గురించి ఎన్నికల్లో ఎక్కడా హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ నిరుద్యోగ భఅతి గురించి వారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించారని, ప్రియాంక గాంధీ కూడా ఓ సభలో వ్యాఖ్యానించారని నిరుద్యోగులు గుర్తు చేశారు. ఈ రెండు అంశాలకు సంబంధించిన ఆధారాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయని తెలిపారు.

➡️