న్యూఇయర్‌ వేడుకలపై సైబరాబాద్‌ పోలీసుల ఆంక్షలు

Dec 30,2023 14:51 #new year celebration

హైదరాబాద్‌: న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా సైబరాబాద్‌ పరిధిలో ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే, ఓఆర్‌ఆర్‌పై రాకపోకలను నిలిపివేయనున్నారు. రేపు రాత్రి 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై అనుమతిస్తామని స్పష్టం చేశారు.ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. క్యాబ్‌, ఆటో డ్రైవర్లు కచ్చితంగా యూనిఫామ్‌ ధరించాలని సూచించారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పబ్‌, క్లబ్‌ల్లో మందు తాగి వాహనాలు నడిపితే పబ్‌ యజమానిపై కేసులు పెడుతామని హెచ్చరించారు. కస్టమర్లకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తూ వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రేపు రాత్రి 8 గంటల నుంచి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

➡️