పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి .. రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య

Jan 15,2024 07:44 #Kadapa, #Suicide

కడప : కడప రైల్వేస్టేషన్‌ పరిధిలో ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. కడప రవీంద్రనగర్‌కు చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో సహజీవనం చేస్తోంది. ఇటీవల తనను వివాహం చేసుకోవాలని అతడిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో.. ఇద్దరూ జీవితంపై విరక్తి చెంది కడప రైల్వేస్టేషన్‌లోని మూడో ప్లాట్‌ఫామ్‌ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే ఎస్సై రారాజు ఘటనాస్థలాన్ని పరిశీలించి మఅతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

➡️