పేట్‌ బషీరాబాద్‌లో అగ్ని ప్రమాదం

Feb 28,2024 10:37 #Fatal fire accident, #hyderabad

హైదరాబాద్ : పేట్‌ బషీరాబాద్‌లోని రాఘవేంద్ర కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. కాలనీలోని ఓ పండ్ల దుకాణం, మటన్‌ షాపు, స్క్రాప్‌ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ మంటల్లో మొత్తం నాలుగు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️