ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధం : గవర్నర్‌ తమిళిసై

Jan 25,2024 15:35 #speech, #tamil sai soundarya rajan

హైదరాబాద్‌: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కేవలం 46శాతం ఓటింగ్‌ నమోదైందని, అలాంటివి పునరావఅతం కాకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో తనకు ఓటు వేయకుంటే చనిపోతానని బెదిరించిన వారూ ఉన్నారని.. అలాంటి విషయాలను ఉపేక్షించవద్దని ఎన్నికల సంఘానికి గవర్నర్‌ సూచించారు. ఓటు వేసేటప్పుడు అభ్యర్థులను పూర్తిస్థాయిలో విశ్లేషించి మంచి వారిని ఎన్నుకోవాలన్నారు. పోలింగ్‌ రోజు ఇచ్చే సెలవును టూర్ల కోసం ఉపయోగించడం బాధాకరమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కును వినియోగించుకోవడమే పౌరుల ప్రథమ బాధ్యతని చెప్పారు. ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు గవర్నర్‌ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఈవో వికాస్‌రాజ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️