ప్రముఖ విద్యావేత్త కెవి రత్నం కన్నుమూత

Mar 20,2024 23:39 #kv ratnam, #passed away

-రేపు అంత్యక్రియలు

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి: ప్రముఖ విద్యావేత్త, రాష్ట్రంలో ప్రయివేటు కోచింగ్‌ సెంటర్లకు ఆధ్యుడు కెవి రత్నం (85) బుధవారం కన్నుమూశారు. కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన నెల్లూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం వారు రత్నం విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. కెవి రత్నం అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ముత్తుకూరు గేట్‌ వద్ద ఆయన అతిథి గృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. పిడితాపోలూరు వద్ద రత్నం విద్యా సంస్థలకు దగ్గరలోగల ఆయనకు చెందిన పొలాల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కెవి రత్నం భార్య గతంలోనే మృతి చెందారు.

➡️