బడ్జెట్‌ ప్రతిపాదనలపై సూచనలు కోరిన ఏపీ ఆర్థిక శాఖ

Jan 24,2024 16:45 #Budget, #Revenue Department

అమరావతి: బడ్జెట్‌ ప్రతిపాదనలపై వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, హెచ్‌వోడీల నుంచి ఆర్థిక శాఖ సూచనలు కోరింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వాస్తవిక అంచనాలు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల కోసం వాస్తవిక గణాంకాలను సమర్పించాలని ఆదేశించింది. బడ్జెట్‌ సవరించిన అంచనాల రూపకల్పన కోసం కొత్త పథకాలకు సంబధించిన గణాంకాలు మినహాయించాలని స్పష్టం చేసింది. కొత్త పనులు, ఈఏపీ ప్రాజెక్టులు, నాబార్డు, కోర్టు కేసులకు సంబధించిన గణాంకాలు మినహాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

➡️