బిఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిపై కేసు నమోదు

తెలంగాణ : కొడంగల్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదయింది.కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నావంటూ … ఈనెల 24వ తేదీన తనను రాళ్లతో, కర్రలతో కొట్టారని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కూర నరేశ్‌ నారాయణపేట జిల్లా కోస్గి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నరేందర్‌ రెడ్డితో సహా ఎనిమిదిమందిపై 307తో పాటు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో పట్నం నరేందర్‌ రెడ్డిని ఏ1గా చేర్చారు. ఈ నెల 24వ తేదీన తనపై దాడి చేశారని కూర నరేశ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే తన ఫోన్‌, బైక్‌ తాళంచెవి, మూడు తులాల బంగారు గొలుసు, రూ.20వేల నగదు లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

➡️