బేగంపేటలో ‘వింగ్స్‌ ఇండియా-2024’ ప్రదర్శన ప్రారంభం

Jan 18,2024 11:52 #air show, #hyderabad, #wing india

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్‌ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌లో వింగ్స్‌ ఇండియా ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో ఏవియేషన్‌ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని.. సులభతర వాణిజ్య విధానం ఇక్కడ అమలవుతోందన్నారు. ఏరో స్పేస్‌ పెట్టుబడులకు హైదరాబాద్‌ ఎంతో అనుకూలం. డ్రోన్‌ పైలట్లకు ఎక్కువగా శిక్షణ ఇచ్చి.. వ్యవసాయం, అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల్లో డ్రోన్లు వినియోగిస్తున్నామని అని తెలిపారు.

➡️