బేగంపేట లైఫ్‌ స్టైల్‌ భవనంలో అగ్నిప్రమాదం

Jan 19,2024 15:40 #Fire Accident, #hyderabad

హైదరాబాద్‌: బేగంపేటలోని లైఫ్‌ స్టైల్‌ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఉన్న ఓ సెలూన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని భవనాన్ని ఖాళీ చేయించి.. మంటలను అదుపు చేశారు. సిలిండర్‌ లీక్‌ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

➡️