బోయిన్‌పల్లిలో కారు బీభత్సం

Feb 16,2024 17:18 #boinpalli, #road accident

హైదరాబాద్‌ : నగరంలోని బోయిన్‌పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓల్డ్‌ బోయిన్‌పల్లి నుంచి మల్లారెడ్డి గార్డెన్‌ వైపు వెళ్తున్న క్రమంలో వేగంగా దూసుకొచ్చి మరో కారును కారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి ఢీకొని కారు ఆగిపోయింది. కారు శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పలువురికి గాయాలు అయినట్లు సమాచారం. కారు వేగంగా ఢీ కొట్టడంతో మరో కారు కూడా ధ్వంసమైంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️