మణికొండలో కలకలం.. పార్కింగ్‌ చేసిన కారులో ఆటో డ్రైవర్‌ మృతదేహం

Feb 4,2024 15:40 #crime

హైదరాబాద్‌ : మణికొండలోని ఓ కారులో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. మారుతి వాన్‌లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 100 కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు డ్రైవర్‌ సీటు వెనుక మృతదేహాన్ని గుర్తించారు.హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి ఆటోడ్రైవర్‌ రమేశ్‌దిగా గుర్తించారు. కారు నెంబరు ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️