మనస్తాపంతోనే వైసిపికి రాజీనామా – అన్నా రామచంద్రయ్య యాదవ్‌

Mar 27,2024 23:00 #Resign To YCP, #tirupathi

ప్రజాశక్తి – తిరుపతి(మంగళం) :రాష్ట్రవ్యాప్తంగా యాదవులు, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సామాజిక తరగతికి చెందిన వారి ఆర్థిక మూలాలను చిదిమేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వైసిపి ఎమ్మెల్యేలు అనుసరిస్తోన్న విధానాలతో మనస్తాపానికి గురై వైసిపి ప్రాథమిక, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య యాదవ్‌ తెలిపారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ… జనాభా దామాషా ప్రకారం బిసిలకు సీట్లు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల్లోనూ, రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లోనూ యాదవులకు ఒక్క శాసనసభ అభ్యర్థిత్వాన్ని కూడా కేటాయించకపోవడం విస్మయానికి గురి చేసిందని చెప్పారు. రాష్ట్రంలో విశాఖ, తిరుపతి నగరపాలక సంస్థలకు మేయర్లుగా యాదవులకు ప్రాధాన్యం ఇచ్చారే గాని పెత్తనం అంత పెత్తందారీ ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్లు, రీజనల్‌ కో-ఆర్డినేటర్ల చేతిలోనే ఉంచుకొని అవమానభారాన్ని మేయర్లపై నెట్టివేశారని విమర్శించారు. ‘మీ ప్రతిభతో మీకు ఈ స్థానం రాలేదు… మా కాళ్లు పట్టుకుంటే ఇచ్చామని’ యాదవ సామాజిక తరగతికి చెందిన ఎమ్మెల్సీ రమేష్‌ను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అనడం బిసిల పట్ల వారికున్న చిత్తశుద్ధిని బయట పెట్టిందన్నారు. నా ఈ రాజీనామా వ్యక్తిగత విషయం మాత్రమేనని, నా కుటుంబ సభ్యుల రాజీనామాలు వారి వ్యక్తిగతమని తెలిపారు.

➡️