మల్లాదికి టికెట్‌ ఇవ్వకపోవడంపై బ్రహ్మణ సంఘాల నిరసన

Jan 3,2024 15:05 #brahmana sanghalu, #nirasana

అమరావతి : విజయవాడలో మళ్లీ కులాల చిచ్చు చెలరేగింది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు టికెట్‌ ఇవ్వకపోవడంపై బ్రాహ్మణ సంఘాల నిరసనకు దిగాయి. విశాఖలో ద్రోణంరాజు శ్రీనివాస్‌ మఅతితో ఆ స్థానాన్ని వేరే వారికి కేటాయించారని సంఘాలు చెబుతున్నాయి. వైసీపీ ఉన్న మూడు స్థానాల్లో రెండు స్థానాలు నుంచి బ్రాహ్మణులను తొలగించిందని బ్రాహ్మణ సంఘాల నేతలు మండిపడుతున్నారు.అన్ని పార్టీలు తమను నిర్లక్ష్యం చేస్తున్నాయని సంఘాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన మల్లాది విష్ణుకు టికెట్‌ నిరాకరించడంపై బ్రాహ్మణ సంఘాలు సీరియస్‌ అయ్యాయి. బుధవారం విజయవాడలో అధికార పార్టీ వైఖరిపై మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం బ్రాహ్మణ సమాఖ్య, ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం, విజయవాడ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరుగనుంది.

➡️