మాట తప్పారు మడమ తిప్పారు

Dec 26,2023 15:16 #Dharna, #muncipal workers
  • కార్మికుల ఇచ్చిన ఆ హామీలను విస్మరించిన ముఖ్యమంత్రి
  • నిరవధిక సమ్మెలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల్‌

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : మున్సిపల్‌ పారిశుద్ధ్య ఇంజనీరింగ్‌ కార్మికులకు రెగ్యులరైజ్‌ చేస్తామని సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించారని మాట తప్పి మడమ తిప్పారని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల్‌ ధ్వజమెత్తారు. మంగళవారం నుంచి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను చేపట్టారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట విధులు బహిష్కరించి పారిశుధ్య ఇంజనీరింగ్‌ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాల్గొన్న కార్మికులను ఉద్దేశించి ఓబుల్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణ జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విస్మరించినందున సమ్మె తప్ప మరో మార్గం లేదనీ అన్నారు. ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ పేర్కొనడం జరిగిందన్నారు అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను కమిటీల పేరుతో కాలయాపన చేయటం తప్ప ఇప్పటివరకు వారు ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు వేతనాల పెంపుకు నిధులు లేవని పేర్కొంటున్న ప్రభుత్వం విలాసవంతమైన భవనాలను ముఖ్యమంత్రి నివాసంగా ఖర్చు చేయటానికి నిధులు ఎక్కడివి అని ప్రశ్నించారు. జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇచ్చిన స్థలాలలో ఒక కుటుంబానికి నివాసం ఉండటానికి అనువుగా లేని ఇరుకు ఇల్లు తయారవుతున్నాయన్నారు. అదే ముఖ్యమంత్రి నివాసానికి ఎకరాలలో భారీ భవంతులు నిర్మిస్తున్నారని 20 ఏళ్ల క్రితం పని చేస్తున్నటువంటి కార్మికులే ఇప్పటికీ విధులు నిర్వహిస్తున్నారు కానీ వారి సంఖ్య మాత్రం పెరగటం లేదన్నారు. నగర జనాభా పెరిగిన విస్తీర్ణం పెరిగిన కార్మికుల సంఖ్య మాత్రం పెంచకపోవడం ద్వారా కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం, పర్మనెంట్‌ చేయాలని, బకాయి ఉన్న డిఏలు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, సిపిఎస్‌ రద్దు, ఓపిఎస్‌ అమలు చేయాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్‌ వేతనాలు అమలు కోసం అనంతపురం నగరంలో పారిశుధ్యంలో గ్యార్బజ్‌ మలేరియా కోవిడ్‌ కార్మికులకు ఆప్కాస్‌ లో చేర్చి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర సమస్యల పరిష్కారం కోసం సమ్మె ప్రారంభించడం జరిగిందనీ అన్నారు. సమ్మె ప్రారంభానికి మున్సిపల్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు బండారి స్వామి అధ్యక్షత వహించారు. కార్మికులందరూ పనిముట్లతో పరకలు కాలువ శుభ్రం చేసే కట్టెలతో, మున్సిపల్‌ ఆఫీస్‌ దగ్గర నుంచి టవర్‌ క్లాక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విశాఖలో 500 కోట్లతో ఆయన నివాసం కట్టుకోవడానికి ఖర్చు పెడుతున్నది అందరికీ తెలిసిన విషయమే కానీ మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడంలో పర్మనెంట్‌ చేయడానికి అడ్డంకులు ఏమున్నాయని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారం చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మా పోరాటాన్ని ఉదతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గురురాజా వెంకట్‌ నారాయణ ముత్తాజ , ఇంజనీరింగ్‌ విభాగం జిల్లా నాయకులు మల్లికార్జున సంజీవరాయుడు నగర అధ్యక్ష కార్యదర్శులు బండారి ఎర్రి స్వామి తిరుమలేశు, మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి భర్తల ఆదినారాయణ.ఎమ్మార్పీఎస్‌ అనుబంధ నాయకులు నల్లప్ప , మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు భగత్‌ సింగ్‌ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ నాయకులు ఆది ,ఆజాం, మాజీ గ్రంథాలయ చైర్మన్‌ గౌస్‌ మోదిన్‌,ఇంమద్దతు తెలిపారు. జనీరింగ్‌ విభాగం నగర అధ్యక్ష కార్యదర్శులు ఓబులపతి పోతులయ్య, మున్సిపల్‌ యూనియన్‌ మహిళా నాయకురాలు వరలక్ష్మీ, లక్ష్మీనరసమ్మ కాంతమ్మ, లక్ష్మీదేవి, సర్దానమ్మ, ఇమాంబి, రవి ప్రభాకర్‌, శేషాంద్ర కుమార్‌ పాల్గొన్నారు. సమ్మెలో మెయిన్‌ ఆఫీస్‌లో పనిచేస్తున్న అటెండర్లు డ్రైవర్లు కంప్యూటర్‌ ఆపరేటర్లు వర్క్‌ ఇన్స్పెక్టర్లు హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ లో పనిచేస్తున్న మొత్తం అన్ని విభాగాలకు సంబంధించిన ఔట్సోర్సింగ్‌ సమ్మెలో పాల్గొన్నారు.

➡️