ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం

Dec 14,2023 15:30 #cabinet meeting, #closed, #Telangana

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ భేటీ ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం లభించింది. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించనున్నారు. గవర్నర్‌ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే దానిపై సుమారు గంటన్నరపాటు చర్చ జరిగింది.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉంది.. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందనే అంశాలతో గవర్నర్‌ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని ప్రభుత్వం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మిగతా నాలుగు గ్యారంటీల అమలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అనంతరం గవర్నర్‌ ప్రసంగాన్ని ఆమోదిస్తూ కేబినెట్‌ తీర్మానం చేసింది.

➡️